Pawan Kalyan: ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌.. ఇంద్ర‌కీలాద్రి ఆల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ శుద్ధి కార్య‌క్ర‌మం

AP Deputy CM Pawan Kalyan at Vijayawada Kanaka Durga Temple

  • శ్రీవారి ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష
  • క‌న‌క‌దుర్గ ఆల‌యం మెట్లు క‌డిగి, ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన జ‌న‌సేనాని
  • తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 1న ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌ విరమణ  

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌లో భాగంగా ఆయ‌న ఇవాళ విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రి అమ్మ‌వారి ఆల‌యంలో శుద్ధి కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణ మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 

మొద‌ట ఆల‌యం మెట్ల‌ను నీటితో జ‌న‌సేనాని శుభ్రం చేశారు. అనంత‌రం మెట్ల‌కు ప‌సుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీలు బాలశౌరి, కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ హ‌రిప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

ఇక ప్రాయ‌శ్చిత్త‌ దీక్ష‌ను తిరుమ‌ల‌లో అక్టోబ‌ర్ 1న ప‌వ‌న్ విర‌మించ‌నున్నారు. దీనికోసం ఆయ‌న తిరుప‌తి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమ‌ల‌కు న‌డుచుకుంటూ వెళ్ల‌నున్నారు. 2వ తేదీన వెంక‌టేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్న త‌ర్వాత దీక్ష విర‌మించ‌నున్నారు.

  • Loading...

More Telugu News