TET: అక్టోబరు 3 నుంచి ఏపీలో టెట్ పరీక్షలు

AP Govt will conduct TET from Oct 3

  • ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు రంగం సిద్ధం
  • అక్టోబరు 3 నుంచి 21 వరకు టెట్
  • అక్టోబరు 11, 12 తేదీల్లో మినహా... మిగతా అన్ని తేదీల్లో పరీక్షలు

ఏపీలో టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) పరీక్షలకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 3 నుంచి 21 వరకు రాష్ట్రంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగ నేపథ్యంలో, అక్టోబరు 11, 12 తేదీల్లో మినహా మిగతా తేదీల్లో టెట్ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. 

టెట్ పరీక్షకు 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. సెప్టెంబరు 22 నుంచి టెట్ అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేస్తున్నట్టు పేర్కొంది. 

seap.gov.in వెబ్ పోర్టల్ లో టెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నిన్నటి నుంచి ఇవాళ్టివరకు 2,84,309 మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని వివరించింది. 

వివరాలకు 93988 10958, 62817 04160, 81219 47387 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.

  • Loading...

More Telugu News