Revanth Reddy: కుటుంబ డిజిటల్ కార్డుపై రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy review on digital health cards

  • కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలన్న సీఎం
  • ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలన్న సీఎం
  • డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల హెల్త్ ప్రొఫైల్ ఉండాలన్న సీఎం

తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల జారీ కోసం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌తో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డిజిటల్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. 

డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలని సీఎం సూచించారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలలో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

వన్ స్టేట్... వన్ డిజిటల్ కార్డు విధానం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు చేస్తోంది.

Revanth Reddy
Health
Telangana
  • Loading...

More Telugu News