Rishab Pant: తాను బ్యాటింగ్ చేస్తూ బంగ్లాదేశ్‌కు ఫీల్డింగ్ సెట్‌ చేయడానికి కారణం చెప్పిన రిషబ్ పంత్

I saw two fielders at the same area so adviced them to change field say Rishab Pant

  • మిడ్ వికెట్ వైపు ఫీల్డర్ లేడని గమనించానని చెప్పిన పంత్
  • ఒకే ఏరియాలో ఇద్దరు ఫీల్డర్లు ఉండడంతో ఒకరిని అటువైపు పంపించినట్టు వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన అతడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాది అందరి ప్రశంసలు అందుకున్నాడు. 

కాగా రెండో ఇన్నింగ్స్‌లో తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్ బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ను మార్చడం లైవ్ లో కనిపించింది. మైదానంలో ఫీల్డర్ లేనివైపు ఒక ఫీల్డర్‌ను పంపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ మార్చడం ఏంటంటూ ఆ వీడియో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అయితే తాను బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను మార్చడానికి కారణాన్ని పంత్ వెల్లడించాడు.

అక్కడ (మిడ్ వికెట్) ఫీల్డర్ లేడని తాను గమనించానని పంత్ చెప్పాడు. ఒకే ఏరియాలో ఇద్దరు ఫీల్డర్లు ఉండడాన్ని గుర్తించానని, అందుకే ఒక ఫీల్డర్‌ను మిడ్-ఫీల్డ్‌ వైపు పంపించినట్టు అతడు వెల్లడించాడు. 

‘‘నేను తరచుగా అజయ్ భాయ్‌తో (అజయ్ జడేజా-ఢిల్లీ క్రికెట్ జట్టు కోచ్) మాట్లాడుతుంటాను. ఎక్కడ ఆడినా, ఎవరిపై ఆడినా క్రికెట్ నాణ్యత మెరుగుపడాలని ఆయన చెబుతుంటారు’’ అని పంత్ వివరించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ ఆసక్తికర కారణాన్ని చెప్పాడు.

కాగా ఈ మ్యాచ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 6వ సెంచరీని సాధించాడు. 2022 డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత అతడికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News