Jr NTR: 'దేవర' స్పెషల్ షో, టిక్కెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్

TG Government green signal for special show of Devara
  • ఈ నెల 27న విడుదల కానున్న జూ.ఎన్టీఆర్ దేవర సినిమా
  • 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి
  • 29 థియేటర్లలో ఒంటిగంట షోకు అనుమతి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది. 

ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 29 థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట షోకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి షోకు టిక్కెట్ ధరను రూ.100 మేర పెంచుకోవడానికి అనుమతించింది.

మొదటి రోజు వేకువజామున 4 గంటల నుంచి షోలు వేసుకోవడానికి అనుమతించింది. సినిమా విడుదలైన రోజున టిక్కెట్ ధరను రూ.100 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6 వరకు అంటే తొమ్మిది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది.

ఈ సినిమా స్పెషల్ షోలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతించింది. టిక్కెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అవకాశం ఇచ్చింది.
Jr NTR
Devara
Tollywood
Telangana

More Telugu News