Uttam Kumar Reddy: ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దన్న మంత్రి
- అలా కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మిల్లర్లకు హెచ్చరిక
- ప్రతి గింజను కొనుగోలు చేస్తామని స్పష్టీకరణ
ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మిల్లర్లను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందన్నారు. 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సన్నాలు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో 60.39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబటి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు.