Mamata Banerjee: ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

CM Banerjee thanks PM Modi

  • కోల్‌కతాలో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం
  • అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కూ ధన్యవాదాలు తెలిపిన సీఎం
  • బెంగాల్ ప్రభుత్వం నిరంతర కృషి కారణంగా ఈ ప్రతిపాదన వచ్చిందన్న సీఎం

ప్రధాని నరేంద్రమోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. సంయుక్త భాగస్వామ్యంతో కోల్‌కతాలో ప్రతిపాదిత సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆమె వారికి థ్యాంక్స్ చెప్పారు. బెంగాల్ ప్రభుత్వం నిరంతర కృషి కారణంగా ఈ ప్రతిపాదన వచ్చిందన్నారు.

బెంగాల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, ప్రభుత్వరంగ వెబెల్ (WEBEL-వెస్ట్ బెంగాల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) గత ఏడాది కాలంగా ప్రముఖ సెమీ కండక్టర్ పరిశ్రమలను సంప్రదిస్తున్నాయని తెలిపారు. గ్లోబల్ ఫౌండ్రీస్, సినాప్సిస్, మైక్రాన్ వంటి దిగ్గజాలు రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధి పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిపాయని తెలిపారు. ఆ కంపెనీల ప్రతినిధులు ఇక్కడి యూనిట్లు, కార్యాలయాలను సందర్శించారన్నారు.

Mamata Banerjee
Narendra Modi
BJP
West Bengal
  • Loading...

More Telugu News