jayaprada: ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ పై జయప్రద!

Jayaprada attends Prabhas starring Fauji shooting in Madurai

  • ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ'
  • కీలకపాత్రలో జయపద్ర
  • మధురైలో షూటింగ్

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ప్రభాస్ మళ్లీ స్పీడు పెంచాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధురైలో జరుగుతుండగా, అలనాటి అందాలభామ జయప్రద కూడా సెట్స్ పై అడుగుపెట్టింది. ఈ షెడ్యూల్ లో జయప్రదపై పలు కీలక  సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

మధురైలో జరిగిన తొలి రోజు షూటింగ్ లో ప్రభాస్ తప్ప మిగతా తారాగణం మొత్తం పాల్గొన్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్ స్వాతంత్ర్య కాలం నాటి సైనికుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. 

ఈ హిస్టారికల్ డ్రామా చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ఇమాన్వికి ఇదే తొలి చిత్రం. ఇటీవలే ఫౌజీ హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 

అటు, ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ది రాజా సాబ్ చిత్రం హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతోంది.

  • Loading...

More Telugu News