Munjya: ఎక్కడి 30 కోట్లు .. ఎక్కడి 130 కోట్లు .. 'ముంజ్యా' మూవీ రికార్డ్!

Munjya Movie Update

  • హిందీలో రూపొందిన 'ముంజ్యా'
  • జూన్ లో థియేటర్లలో విడుదల 
  • తెలుగులో అందుబాటులోకి వచ్చిన సినిమా  
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ


ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ జోనర్ కి సంబంధించిన కథలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందువలనే ఓటీటీ సంస్థలన్నీ కూడా క్రైమ్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ కంటెంట్ ను దింపేయడంలో పోటీ పడుతున్నాయి. అలా ఓటీటీ క్యాంపస్ లోకి అడుగుపెట్టిన సినిమాగా 'ముంజ్యా' కనిపిస్తుంది. 

ఈ ఏడాది జూన్ 7వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. హరర్ థ్రిల్లర్ జోనర్లో .. రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, రూ. 130 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. దినేశ్ విజయన్ - అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. అభయ్ వర్మ .. శర్వాణి .. మోనా సింగ్ .. సత్యరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 24వ తేదీ నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.    

అయితే హిందీలో ఈ సినిమాను నిర్మించగా, తెలుగు వెర్షన్ ను రీసెంటుగా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. గతంలో 'చెట్టుమీద దెయ్యం' కాన్సెప్టుతో చాలా జానపద కథలు వినిపించాయి. అలాంటి కథల్లో నుంచి ఇది పుట్టుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. కాస్త కామెడీ టచ్ తో సాగే పిల్ల దెయ్యం కథ కావడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.   

Munjya
Sharvani
Abhay Varma
Sahyaraj
  • Loading...

More Telugu News