Jetwani: జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఐపీఎస్ లను నిందితులుగా చేర్చిన పోలీసులు

3 AP IPS officers names in remand report

  • నేడు కుక్కల విద్యాసాగర్ ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
  • రిమాండ్ రిపోర్టులో ఐపీఎస్ ల పేర్లు
  • ఏ2, ఏ3, ఏ6లుగా పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ

ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను ఈ తెల్లవారుజామున పోలీసులు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్సార్ ఆంజనేయులు, కాంతి రాణా తాతా, విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా విద్యాసాగర్, ఏ2గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్నీ పేర్లను పేర్కొన్నారు.  

మరోవైపు, కుక్కల విద్యాసాగర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విద్యాసాగర్ ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కాంతి రాణా తాతా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రేపటి వరకు కాంతి రాణాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆయన ముందస్తు బెయిల్ పై హైకోర్టు రేపు తీర్పును వెలువరించనుంది.

  • Loading...

More Telugu News