KA Paul: కేఏ పాల్ పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ

High Court to heat KA Paul petition today

  • పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
  • పార్టీలు మారడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్న పాల్
  • పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు విన్నపం

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్ వేశారు. దీనిని తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించనుంది. 

ఒక పార్టీ తరపున గెలుపొంది మరొక పార్టీలోకి చేరడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో కేఏ పాల్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించడం ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు. 

మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ లో ఒక పిటిషన్, జులైలో మరో పిటిషన్ ను బీఆర్ఎస్ నేతలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారిస్తామని తెలిపింది.

  • Loading...

More Telugu News