Pushpa 2: 'పుష్ప‌-2' నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్‌ విడుద‌ల

Pushpa 2 Movie Special Poster Released

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప‌-2'
  • డిసెంబ‌ర్ 6న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న మూవీ
  • రిలీజ్‌కు మ‌రో 75 రోజులు ఉన్న‌ నేప‌థ్యంలో ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న 'పుష్ప: ది రూల్' మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా సాగుతోంది. మ‌రో 75 రోజుల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌లో మ‌రోసారి బ‌న్నీని హైలైట్ చేశారు. అలాగే చూడ‌గానే ఆక‌ట్టుకునేలా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు మేక‌ర్స్‌. ఇక ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌, పోస్ట‌ర్లు పుష్ప‌-2పై భారీ అంచ‌నాలు పెంచేశాయి. దీంతో ట్రైల‌ర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

కాగా, ఈ మూవీ రిలీజ్ ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డి, ఇప్పుడు డిసెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. బ‌న్నీకి జాతీయ‌ అవార్డు తెచ్చిపెట్టిన‌ 'పుష్ప' సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న 'పుష్ప‌-2' ఎంత‌వ‌ర‌కు అభిమానుల‌ను అల‌రిస్తుందో చూడాలి. 

అల్లు అర్జున్‌కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌తినాయకుడిగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో గ్రాండ్ మూవీ తెర‌కెక్కుతోంది.

  • Loading...

More Telugu News