Vijayasai Reddy: మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?.. విజ‌య‌సాయిరెడ్డి ఫైర్‌!

YSRCP MP Vijayasai Reddy Fires on AP Government


ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వాల‌నుకుంటోంద‌ని వైసీపీ ఎంపీ, సీనియ‌ర్ నేత విజ‌య‌సాయిరెడ్డి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు ఆయ‌న స్పెష‌ల్ ట్వీట్ చేశారు. 

"మెడిసిన్స్ లేదా విద్యా సంస్థ‌ల ఫీజుల‌ను త‌గ్గించ‌కుండా, మ‌ద్యం ధ‌ర‌ను (రూ.99/180ఎంఎల్‌) త‌గ్గించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇది మ‌ద్య‌పానాన్ని, గృహ హింస‌ను పెంచుతుంది. ప్ర‌జారోగ్యాన్ని మ‌రింత దిగ‌జారుస్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌ల‌పై సందేహం క‌లుగుతోంది" అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

More Telugu News