HYDRA: రికార్డ్ సృష్టించిన హైడ్రా.. విల్లాలు, హాస్పిటల్, అపార్ట్ మెంట్ల కూల్చివేత

HYDRA creates record

  • అమీన్ పూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్
  • నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు
  • తొలిసారి పగలు, రాత్రి ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా

హైదరాబాదు పరిసరాలలో అక్రమ కట్టడాలను కూలుస్తూ ఆక్రమణదారుల గుండెలలో హైడ్రా దడ పుట్టిస్తోంది. తాజాగా హైడ్రా రికార్డ్ సృష్టించింది. అమీన్ పూర్ లో బిగ్ ఆపరేషన్ ను పూర్తి చేసింది. నాన్ స్టాప్ గా 17 గంటల పాటు కూల్చివేతలు చేపట్టింది. రాత్రి ఒంటి గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. పటేల్ గూడలో 16 విల్లాలను కూల్చి వేశారు. ఒక హాస్పిటల్, 2 అపార్ట్ మెంట్లను కూడా అధికారులు కూల్చివేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత పగలు, రాత్రి ఆపరేషన్ ను నిర్వహించడం ఇదే తొలిసారి. అక్రమ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

HYDRA
Hyderabad
  • Loading...

More Telugu News