Team India: బంగ్లాదేశ్‌పై గెలుపుతో చరిత్ర సృష్టించిన భారత్... 1932 తర్వాత ఇదే తొలిసారి

Win against Bangladesh was Indias 179th in Test history and with 178 losses

  • టెస్టుల్లో 179వ విజయాన్ని అందుకున్న భారత్
  • టెస్టుల్లో ఓటముల సంఖ్యను విజయాల సంఖ్య అధిగమించడం ఇదే తొలిసారి
  • ఇప్పటివరకు 581 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 సార్లు ఓడిన భారత్

చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 280 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది. 

92 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి మొత్తం ఓటముల సంఖ్యను విజయాల సంఖ్య అధిగమించింది. బంగ్లాదేశ్‌పై దక్కింది భారత్‌కు 179వ విజయం.. కాగా 178 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటములను మూటగట్టుకుంది. కాగా టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 581 మ్యాచ్‌లు ఆడింది. 

1932లో సీకే నాయుడు కెప్టెన్సీలో భారత్ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆడింది. ఆ మ్యాచ్‌లో 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్ తర్వాత ఒక్కసారి కూడా ఓటముల కంటే అధికంగా విజయాలు నమోదు కాలేదు. ఎల్లప్పుడూ ఓటముల సంఖ్యే అధికంగా ఉంటూ వచ్చాయి. 92 ఏళ్ల ఈ సుదీర్ఘ నిరీక్షణకు బంగ్లాదేశ్‌పై విజయం రూపంలో తెరపడింది. 

కాగా టెస్టుల్లో ఓటముల సంఖ్య కంటే విజయాలు ఎక్కువ సాధించిన జట్ల జాబితాలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ కూడా ఉన్నాయి.

టెస్టుల్లో ఓటముల కంటే విజయాలు ఎక్కువ సాధించిన జట్లు ఇవే...
1. ఆస్ట్రేలియా: విజయాలు- 414, ఓటములు -232
2. ఇంగ్లండ్: విజయాలు - 397, అపజయాలు -325
3. దక్షిణాఫ్రికా: గెలుపులు -179, ఓటములు - 161
4. ఇండియా: విజయాలు- 179, అపజయాలు -178
5. పాకిస్థాన్: విజయాలు- 148, ఓటములు - 144.

  • Loading...

More Telugu News