IICT: ఐఐసీటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు

IICT Job Notification

--


ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) హైదరాబాద్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ ఐఐసీటీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. రెండు విభాగాల్లో మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

సీఎస్ఐఆర్ ఐఐసీటీ వెబ్ సైట్ నుంచి దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకుని విద్యార్హతలకు సంబంధించిన కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. మెట్రిక్/10వ తరగతి, ఇంటర్, పీజీ, నెట్/ గేట్ తదితర సర్టిఫికెట్లు, కేటగిరీ/కులం వారిగా రిజర్వేషన్ సర్టిఫికెట్స్ తో రావాలని చెప్పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు. ఇక వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 27 నుంచి 30 వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

IICT
Job Notifications
Interviews
Jobs
  • Loading...

More Telugu News