Sri Lanka Presidential elections: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. తదుపరి అధ్యక్షుడిగా దిస్సనాయకే!

Sri Lanka Presidential elections Anura Dissanayake takes early lead

  • శ్రీలంకలో నిన్న అధ్యక్ష ఎన్నికలు
  • ఆ వెంటనే ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • ముందంజలో  ఎన్‌పీపీ నేత అనుర కుమార దిస్సనాయకే 
  • గెలిస్తే ఈ రోజే ప్రమాణ స్వీకారం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ట్రెండ్స్ ప్రకారం నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) నేత అనుర కుమార దిస్సనాయకే (55) ముందంజలో ఉన్నారు. ఆయనే కనుక విజయం సాధిస్తే తొలి వామపక్ష దేశాధినేతగా రికార్డులకెక్కుతారు. ప్రస్తుతం ఉన్న లీడ్స్ ఇలాగే కొనసాగితే దిస్సనాయకే శ్రీలంక 9వ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు.  

కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గత రాత్రి పది గంటల నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు దేశంలో కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పుడు దీనిని ఈ మధ్యాహ్నం వరకు పొడిగించారు. మరోవైపు, ప్రభుత్వం రేపు ప్రత్యేక సెలవు ప్రకటించింది. 

ఇటీవల దేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభం తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నిక కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రతిపక్ష నేత, సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ)కి చెందిన నేత సజిత్ ప్రేమదాస, జనతా విముక్తి పేరమున పార్టీకి చెందిన మార్క్సిస్ట్ నేత, అనుర కుమార దిస్సనాయకే సహా మొత్తం 39 మంది అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు.

More Telugu News