Nagarjuna: అభయ్ నువ్వో సైకో .. బయటికిపో: బిగ్ బాస్ లో నాగార్జున!

Bigg Boss 8 Update

  • బిగ్ బాస్ ను కామెంట్ చేసిన అభయ్ 
  • అతని ధోరణి పట్ల నాగ్ అసహనం 
  • 'రెడ్ కార్డు' ఇస్తున్నట్టు ప్రకటించిన నాగ్ 
  • బయటికి వెళ్లిపొమ్మని వార్నింగ్  
  • మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో మనసు మార్చుకున్న నాగ్    


బిగ్ బాస్ హౌస్ లో ఇంతవరకూ పోటీదారుల మధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతూనే వచ్చాయి తప్ప, నాగార్జున వైపు నుంచి ఎవరికీ స్ట్రాంగ్ వార్నింగ్ మాత్రం పడలేదు. ఆ లోటును మొదటి సారిగా అభయ్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా అభయ్ 'బిగ్ బాస్' తీరు పట్ల కామెడీగా కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ కామెంట్స్ విషయంలో ఆయన చాలా దూరం వెళ్లాడు కూడా. ఆ కామెంట్స్ ను సమర్ధిస్తున్నటుగా హౌస్ లోని కొంతమంది నవ్వడంతో, ఆయన మరింత రెచ్చిపోయాడు.  

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. ముందుగా ఆయన అభయ్ విషయాన్నే ప్రస్తావించారు. బిగ్ బాస్ పై అభయ్ చేసిన కామెంట్స్ పట్ల అసహనాన్ని ప్రదర్శించారు. బిగ్ బాస్ చెప్పినట్టుగా నడచుకోవలసిందేననీ, అది ఇష్టం లేకపోతే హౌస్ లో నుంచి బయటికి వెళ్లిపోవచ్చని అన్నారు. అభయ్ ఒక 'సైకో'లా ప్రవర్తించాడని అంటూ, ఆయనకి 'రెడ్ కార్డు' ఇస్తున్నట్టుగా చెప్పారు. 

బిగ్ బాస్ ను గేట్లు ఓపెన్ చేయమని నాగార్జున చెప్పగానే, మెయిన్ గేట్లు తెరుచుకున్నాయి. దాంతో హౌస్ లోని పోటీ దారులంతా షాక్ అయ్యారు. తాను చేసిన పొరపాటుకు అభయ్ సారీ చెప్పాడు. తన కెరియర్ తో ముడిపడిన ఈ షో నుంచి పంపించవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఈ ఒక్కసారికి అతణ్ణి క్షమించమని మిగతా పోటీదారులు నాగార్జునను రిక్వెస్ట్ చేశారు. ఇకపై ఎవరు ఇలా మాట్లాడినా ఆ క్షణమే హౌస్ లో నుంచి బయటికి పంపించి వేస్తామని హెచ్చరించిన నాగార్జున, అభయ్ ను అంతటితో వదిలేశారు.

Nagarjuna
Abhai
Nikhil
Adithya
Manikantha
  • Loading...

More Telugu News