Thota Chandrasekhar: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై కేసు నమోదు

CCS Police Files Case Against AP BRS Chief Thota Chandrasekhar

  • ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ నుంచి రూ. 28 కోట్లు రావాలంటూ సాయి తిరుమల కన్‌స్ట్రక్షన్స్ అధినేత తిరుమలరావు ఫిర్యాాదు
  • డబ్బులు అడిగితే బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారని ఆరోపణ
  • చంద్రశేఖర్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు

ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ చీఫ్, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ తోట చంద్రశేఖర్‌, ఆ సంస్థ ప్రతినిధులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కంపెనీకి ఇవ్వాల్సిన రూ. 28 కోట్లు ఇవ్వకుండా చంద్రశేఖర్ మోసం చేశారంటూ సాయి తిరుమల కన్‌స్ట్రక్షన్స్ ఎండీ వాకాడ తిరుమలరావు ఈ ఏడాది ఏప్రిల్ 27న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు నెలల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తమ 220 ప్లాట్లను అభివృద్ధి చేసేందుకు మార్చి 2021లో ‘సాయి తిరుమల’ అనుబంధ సంస్థ ఎస్ఎస్టీతో ఆదిత్య సంస్థ ఒప్పందం కుదుర్చుకుని  వర్క్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో రూ. 50 కోట్లు పెట్టుబడి పెట్టి 90 శాతం పనులు పూర్తిచేసి తిరిగి ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించింది. ఆ ప్లాట్లను  ఆదిత్య విక్రయించినప్పటికీ తమకు మాత్రం డబ్బు చెల్లించలేదని, అడిగితే బెదిరిస్తున్నారని తిరుమలరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడిగేందుకు వెళ్లిన తమపై బౌన్సర్లను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. సాయి తిరుమల కన్‌స్ట్రక్షన్ నిర్వాహకులు నిన్న హైదరాబాద్‌లోని ఆదిత్య కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగినట్టు తెలిసింది. మరోవైపు, తిరుమలరావు ఫిర్యాదు మేరకు తోట చంద్రశేఖర్, తోట సత్యనారాయణ, తోట అనిరుధ్, తోట మణిబాబు, అజయ్, శివపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News