aha: 'ఆహా'లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్

teenagers 17 18 who are rushing in aha

  • కన్నడ 'హడినెలెంటు'కి డబ్బింగ్ వర్షన్ గా టీనేజర్స్ 17/18 మూవీ
  • సెప్టెంబర్ 21 నుండి అహాలో స్ట్రీమింగ్ 
  • 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో రికార్డు

ఆహాలో ఇప్పుడు కన్నడ 'హడినెలెంటు' డబ్బింగ్ వర్షన్ టీనేజర్స్ 17/18 చిత్రం ట్రెండింగ్ అవుతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇది కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. యువత ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించారు. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులు సాధించింది. 

దర్శక, నిర్మాతగా పృథ్వీ కొననూర్ వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ మూవీ దూసుకుపోతోంది. ఇప్పటికే అహాలో ఈ మూవీ టాప్ 4లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది.

  • Loading...

More Telugu News