Balakrishna: బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమాకు ముహూర్తం కుదిరింది!

Balakrishna Boyapati Srinu movie opening date fixed

  • దసరాకు ముహూర్తం 
  • యాక్షన్‌ అండ్‌ డివోషనల్‌ అంశాల మేళవింపు 
  • బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌ చిత్రం!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనులది సూపర్‌హిట్‌ కాంబినేషన్‌. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన లెజెండ్‌, సింహా, అఖండ ఈ మూడు చిత్రాలు బ్లాక్‌బస్టర్ చిత్రాలుగా నిలిచాయి.  ఇక ఈ మాస్‌ ద్వయం నాలుగో ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. దసరా పర్వదినాన ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. 

యాక్షన్‌ అండ్‌ డివోషనల్‌ ఎలిమెంట్స్ మేళవింపుగా రూపొందనున్న ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం.  ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్స్‌ నటించనున్నారు. బాలకృష్ణ అఖండ చిత్రానికి సంగీతం అందించి, ముఖ్యంగా ఆ చిత్రానికి తన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో అందరి మెస్మరైజ్‌ చేసిన ఎస్‌.ఎస్‌.తమన్‌ ఈ తాజా చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. 

ఇంతకు ముందు బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంటుందనే వార్త ప్రచారంలో వుంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించలేదు. కాగా, అఖండ చిత్రం తరహాలోనే ఇది కూడా యాక్షన్‌, డివోషనల్‌ అంశాలతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంటున్నారు. 

ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ప్రకటించలేదు. సినిమా ప్రారంభోత్సవం రోజే టైటిల్‌తో పాటు అన్ని విషయాలు అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. 


  • Loading...

More Telugu News