Snake: ఏసీ నుంచి తరగతి గదిలోకి పాము.. వణికిపోయిన విద్యార్థులు.. వీడియో ఇదిగో!

Snake enters Amity classroom through AC vent Viral video

  • నోయిడాలోని ఎమిటీ యూనివర్సిటీ క్లాస్ రూములో ఘటన
  • పామును చూసి, క్లాస్ రూం నుంచి విద్యార్థుల పరుగులు
  • పామును పట్టుకుని తరలించిన నోయిడా అధికారులు

నోయిడాలోని ఎమిటీ యూనివర్సిటీ క్లాస్ రూములో పాము కలకలం రేపింది. ఏసీ వచ్చేందుకు క్లాస్ రూములో ఏర్పాటు చేసిన వెంట్ నుంచి బయటకు వచ్చిన పాము బుసలు కొడుతుండడం చూసి విద్యార్థులు షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును చూసిన విద్యార్థులు క్లాస్ రూము నుంచి బయటకు పరుగులు పెట్టారు. మరికొందరు విద్యార్థులు భయంతో కుర్చీలపైకి ఎక్కారు.   

క్లాసులో లెక్చరర్ పాఠం చెబుతుండగా అనుకోకుండా వచ్చిన ఈ అతిథి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. కొందరు విద్యార్థులు భయంతో పారిపోగా, మరికొందరు తమ సెల్‌ఫోన్లతో దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాచారం అందుకున్న నోయిడా అధికారులు క్లాస్ రూముకు చేరుకుని పామును పట్టుకుని తరలించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News