Srikakulam: శ్రీకాకుళంలో తేనెటీగల దాడి.. ఇద్దరు కూలీల మృతి

Two killed in wasp attack in Srikakulam

--


పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టడంతో కూలీలు భయంతో పరుగులు పెట్టారు. రణస్థలం మండలం లంకపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు.

మరో ముగ్గురు కూలీలు గాయపడగా గ్రామస్థులు  వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లంకపేటకు చేరుకుని విచారణ జరుపుతున్నారు.

More Telugu News