Mumbai: లాల్ బాగ్చా గణపతికి రూ.5.6 కోట్ల నగదు, 4 కిలోల బంగారం కానుకలు

A look at offerings made at Lalbaughcha Raja Lalbaughcha Raja during Ganesh Utsav

  • గణేశ్ ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున కానుకలు
  • కానుకల రూపంలో 64 కిలోల వెండితో పాటు వివిధ రకాల వస్తువులు 
  • సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు గణేషుడి దర్శనం కోసం రాక

ముంబైలోని ప్రసిద్ధ లాల్ బాగ్చా రాజా గణపతికి పెద్ద ఎత్తున కానుకలు వచ్చాయి. తొమ్మిది రోజుల గణేష్ ఉత్సవాల్లో భాగంగా రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండితో పాటు వివిధ రకాల వస్తువులు కానుకల రూపంలో వచ్చాయి. ఈ మేరకు లాల్ బాగ్చా రాజా ఉత్సవ కమిటీ వెల్లడించింది. చిన్న చిన్న కానుకలను వేలం వేయనున్నారని తెలుస్తోంది.

ఈ లాల్ బాగ్చా రాజా గణపతిని చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సామాన్యులు మొదలు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఇక్కడి గణనాథుడి ఆశీర్వాదం కోసం వస్తారు. వారు కానుకలు కూడా సమర్పిస్తుంటారు.

More Telugu News