Ram Charan: ఆస్ట్రేలియాలో వన్యప్రాణులతో రామ్ చరణ్, ఉపాసన... ఫొటోలు ఇవిగో!

Ram Charan and Upasana tours in Australia

  • 'గేమ్ చేంజర్' లో షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా కోసం సన్నాహాలు
  • కుటుంబంతో కలిసి మెల్బోర్న్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సందర్శన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' లో నటిస్తున్న రామ్ చరణ్... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమాను కూడా పట్టాలెక్కించేశారు. 'గేమ్ చేంజర్' లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలోని సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు. 

తాజాగా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ఓ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన రామ్ చరణ్, ఉపాసన... తమ ముద్దుల తనయ క్లీంకారతో కలిసి సందడి చేశారు. అక్కడి జంతువులను ఆసక్తిగా తిలకించారు. కంగారూ పిల్లను క్లీంకారకు చూపించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News