Devara: దేవర బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే...?
- దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు..
- థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీ మార్కెట్
- తెలుగు రాష్టాలలో దేవర మోత
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు వెండితెరకు పరిచయం కానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్లు ప్రీ రిలీజ్ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవైపు సాంగ్స్, ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
తారక్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దేవర సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారు. సెప్టెంబర్ 22న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అందుకే సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దేవర తెలుగు రాష్ట్రాల్లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.113 కోట్లకు పైగా జరిగిందని టాక్. కర్ణాటకలో కూడా దేవర రైట్స్ రూ.15 కోట్లకు పైగా అమ్ముడుపోయాయని టాక్. తమిళనాడులో రూ.6 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది.
అయితే బాలీవుడ్ లో మాత్రం అనుకున్నంత స్థాయిలో మార్కెట్ జరగలేదని కేవలం రూ.15 కోట్లు మాత్రమే బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. కానీ ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధికంగా ఈ సినిమా బిజినెస్ జరిగింది. రూ.26 కోట్లకు పైగా అక్కడ రైట్ అమ్ముడుపోయాయని టాక్. ఇప్పటికే అమెరికాలో టికెట్ ప్రీ -సేల్ విషయంలో కూడా రెండు మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్స్ అందుకుందని తెలుస్తుంది. మిగతా కంట్రీస్ లో రూ.4 కోట్ల వరకు రైట్స్ అమ్ముడుపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్ర బిజినెస్ రూ.100 కోట్లకు పైగా వెళ్ళిందని టాక్. బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకోవాలి అంటే రూ.350 కోట్లకు పైగా గ్రాస్, రూ.180 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంది. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ పరంగా రూ.200 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఈ లెక్కల్ని బట్టి చూస్తే దేవర టీం సేఫ్ జోన్ లో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మాత్రం రూ.200 కోట్ల షేర్ వసూళ్లు జరగాల్సి ఉంది.