Jasprit Bumrah: బుమ్రా కెరీర్‌లో కీలక మైలురాయి... దిగ్గజాల సరసన చేరిన స్టార్ బౌలర్

Jasprit Bumrah completed 400 international wickets to become Indias only tenth bowler to achieve this feat

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు సాధించిన స్టార్ పేసర్
  • బంగ్లాదేశ్‌పై 4 వికెట్లు పడగొట్టడంతో దక్కిన మైలురాయి
  • ఈ ఘనత సాధించిన 10వ భారతీయ బౌలర్‌గా అవతరణ
  • 227 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బుమ్రా

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా చెలరేగిన విషయం తెలిసిందే. 4 కీలకమైన వికెట్లు తీయడం ద్వారా బంగ్లాదేశ్ ను 149 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు కెరీర్‌లో కీలక మైలురాయిని అందుకున్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లను పడగొట్టాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ హసన్ మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా 400వ వికెట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన యార్కర్‌తో తస్కిన్ అహ్మద్‌ను ఔట్ చేసి 401వ వికెట్‌ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

400 వికెట్ల మైలురాయిని అందుకున్న 10వ భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డులకు ఎక్కాడు. బుమ్రా కేవలం 227 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఈ వికెట్లు సాధించడం విశేషం. వేగంగా ఈ మైలురాయిని సాధించిన 5వ భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. అశ్విన్ కేవలం 216 మ్యాచ్‌ల్లోనే 400 వికెట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించాడు.

వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్లు వీళ్లే...
1. రవిచంద్రన్ అశ్విన్ - 216 మ్యాచ్‌ల్లో
2. కపిల్ దేవ్ - 220 మ్యాచ్‌ల్లో
3. మహ్మద్ షమీ - 224 మ్యాచ్‌ల్లో
4. అనిల్ కుంబ్లే- 226 మ్యాచ్‌ల్లో
5. జస్ప్రీత్ బుమ్రా-227 మ్యాచ్‌ల్లో

  • Loading...

More Telugu News