Chiranjeevi: లెజెండరీ ఏఎన్నార్ ను స్మరించుకున్న చిరంజీవి

Chiranjeevi remembered ANR

  • నాగేశ్వరరావు నటనా మేధావి అన్న చిరంజీవి
  • ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కితాబు
  • 'మెకానిక్ అల్లుడు' చిత్రంలో ఆయనతో కలిసి నటించే అదృష్టం కలిగిందని వ్యాఖ్య

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు అక్కినేని శత జయంతి సందర్భంగా ఆయనను చిరంజీవి స్మరించుకున్నారు. 

ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... ఆల్ టైమ్ గ్రేట్ యాక్టర్లలో ఒకరైన నాగేశ్వరరావు గారిని ఆయన శత జయంతి రోజున స్మరించుకుందామని చిరంజీవి పేర్కొన్నారు. నాగేశ్వరరావు గారు నటనా మేధావి అని... ఆయన అద్భుతమైన నటనా ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయని కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కీర్తించారు.  

'మెకానిక్ అల్లుడు' సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కాయని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని తెలిపారు. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

Chiranjeevi
Tollywood
Akkineni Nageswara Rao
  • Loading...

More Telugu News