Ramesh Naidu: భార్యతో కలిసి జగన్ తిరుమల శ్రీవారి దర్శనం ఎందుకు చేసుకోలేదు?: రమేశ్ నాయుడు

BJP Ramesh Naidu fires on Jagan

  • టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న రమేశ్ నాయుడు
  • నెయ్యి సరాఫరా కాంట్రాక్టు ఆల్ఫా సంస్థకు ఎందుకిచ్చారని ప్రశ్న
  • హిందువుల మనోభావాలతో ఆడుకుంటే ఊరుకోబోమని హెచ్చరిక

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు విమర్శించారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నప్పుడే తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారని మండిపడ్డారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన సంస్థలను బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 

నెయ్యి సరఫరాకు ఆల్ఫా అనే సంస్థకు కాంట్రాక్టు ఎందుకిచ్చారని రమేశ్ నాయుడు ప్రశ్నించారు. ప్రసాదం తయారీలో అనుసరించిన తప్పుడు విధానాల వెనుక అంతర్జాతీయ క్రైస్తవుల హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. తన భార్య భారతితో కలిసి జగన్ ఏనాడూ తిరుమల శ్రీవారిని దర్శించుకోలేదని విమర్శించారు. 

హిందువుల మనోభావాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్డీయే పాలన వచ్చిన తర్వాత పాలన పాదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఏపీని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని... రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.

Ramesh Naidu
BJP
Tirumala
Laddu
Jagan
YSRCP
Dharma Reddy
TTD
  • Loading...

More Telugu News