Jani Master: జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు
- పోక్సో చట్టం కింద కేసు
- గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్
- హైదరాబాద్ తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
అత్యాచారం కేసులో అరెస్టయిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను హైదరాబాద్ పోలీసులు నేడు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబరు 3 వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అనంతరం, పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా జానీ మాస్టర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.
జానీ మాస్టర్ తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. పోక్సో కేసు నేపథ్యంలో, జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు.