Apple: ఇవాళ్టి నుంచే ఐఫోన్ 16 విక్రయాలు!

apple to start selling iphone 16 series from sep 20 pro model at rs 119900

  • స్మార్ట్ ఫోన్లపై కేంద్రం దిగుమతి సుంకం తగ్గింపు 
  • తగ్గనున్న ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు 
  • మొబైల్ ధరలను ప్రకటించిన ఆపిల్

గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అపిల్ తన ఐ ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈ రోజు (సెప్టెంబర్20) నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్లను తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్నా వాటి విక్రయాల తేదీ త్వరలో ప్రకటిస్తామని అపిల్ వర్గాలు వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా ఐ ఫోన్ 16 మొబైల్ విక్రయాలు ప్రారంభం అవుతాయని ఆపిల్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, భారత్ మార్కెట్‌లో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్ల లభ్యతపై మాత్రం ఆపిల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. 
 
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ ఫోన్ల కంటే ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు తగ్గనున్నాయి. ఐ ఫోన్ 16 ప్రో మొబైల్ ధర రూ.1,19,900లు, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ధర రూ.1,44,900 నుండి ప్రారంభం అవుతుందని ఆపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఐ ఫోన్ 16 మొబైల్, ఐ ఫోన్ 16 ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఆపిల్ తెలిపింది. ఐ ఫోన్ 16 మొబైల్ ను రూ.79,900లు, ఐ ఫోన్ 16 ప్లస్ మొబైల్ ను రూ.89,900లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

  • Loading...

More Telugu News