Google: భారీ ఎత్తున జీమెయిల్ అకౌంట్లను తొలగించనున్న గూగుల్

google new policy these gmail accounts will be closed from september 20 finish these tasks immediately

  • ఇన్ యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్‌లపై గూగుల్ కీలక నిర్ణయం
  • సర్వర్‌కు భారం అవుతున్న నేపథ్యంలో ఇన్‌యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్‌ల తొలగింపునకు చర్యలు
  • జీ మెయిల్ అకౌంట్‌ల యాక్టివేట్‌కు ఈ రోజు వరకూ గడువు

గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ యాక్టివ్‌గా ఉన్న లక్షలాది జీ మెయిల్ అకౌంట్‌లను తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇన్ యాక్టివ్ మెయిల్ ఐడీల కారణంగా సర్వర్‌పై భారం పడుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి గానూ సెప్టెంబర్ 20 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా అవసరం ఉన్న మెయిల్ ఐడీలను యూజర్లు యాక్టివ్ చేసుకోవాలని లేకపోతే డిలీట్ చేయనున్నట్లు వెల్లడించింది. 

యూజర్లు తమ జీ మెయిల్ అకౌంట్‌లు యాక్టివ్ గా ఉండాలంటే సెప్టెంబర్ 20 (నేడు) లోగా మెయిల్ లాగిన్ చేసి వచ్చిన మెయిల్స్‌ను చదవడం.. ఎవరికో ఒకరికి మెయిల్ చేసినా ఆ జీ మెయిల్ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్‌గా జీ మెయిల్ డిలీట్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది జీ మెయిల్‌ని వినియోగిస్తున్నారు. పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలో జీ మెయిల్ అకౌంట్ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్ధులు మొదలు కొని సంస్థలు, వ్యాపార వేత్తలు తప్పనిసరిగా జీ మెయిల్ అకౌంట్‌లను వినియోగిస్తున్నారు.  

అయితే చాలా మంది ఏదో అవసరం కోసం జీ మెయిల్ అకౌంట్‌లను ఓపెన్ చేసి ఆ తర్వాత మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ మరిచిపోతున్నారు. మరల అవసరమైన సందర్భాల్లో కొత్త అకౌంట్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇన్‌ యాక్టివ్ జీ మెయిల్ అకౌంట్లు ఎక్కువ అయ్యాయి. దీంతో గూగుల్ ఇన్‌యాక్టివ్ అకౌంట్‌లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ఎన్ని వేల మంది తమ జీ మెయిల్ అకౌంట్ లను పునరుద్ధరించుకుంటారో, ఎన్ని జీ మెయిల్ అకౌంట్ లు మూసివేత (డిలీట్) కు గురవుతాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News