Johnny Master: సంచలన నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్ భార్య ఆయేషా

Wife Ayesha supports her husband

  • ఆరోపణలు నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ప్రకటన
  • తన భర్త ప్రతిభను ప్రోత్సహించేవాడే తప్ప నష్టం చేసేవాడు కాదన్న ఆయేషా
  • లైంగిక వేధింపులపై ఆధారాలు లేవన్న జానీ మాస్టర్ భార్య
  • ఫిర్యాదు చేసిన యువతి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్న

తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను ఆయనను వదిలేస్తానని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేషా (సుమలత) అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ఛానల్‌తో మాట్లాడుతూ... తన భర్త ప్రతిభను ప్రోత్సహించేవారే తప్ప ఎవరికీ నష్టం చేసేవాడు కాదన్నారు. ఒక అమ్మాయికి అవకాశం లేకుండా ఆయన ఎందుకు చేస్తారన్నారు.

కొరియోగ్రాఫర్‌గా అగ్రస్థానంలో ఉండాలని లేదా హీరోయిన్‌గా కావాలని ఫిర్యాదు చేసిన యువతి భావించిందన్నారు. ఆమె స్టేజ్ షోల నుంచి సినీ రంగానికి వచ్చారని, ఇక్కడి పరిస్థితిని చూసి లగ్జరీ లైఫ్ కోరుకుందన్నారు. అందుకే తనకు అధిక ప్రాధాన్యత ఉండాలని ఎప్పుడూ కోరుకునేదని తెలిపారు.

ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని అంటున్నారని, మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిందనడానికి ఆధారాలు లేవన్నారు. ఆయనతో సదరు యువతి సాన్నిహిత్యంగా ఉండగా ఎవరైనా చూశారా? అని ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసిన ఆ యువతి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.

జానీ మాస్టర్ వద్ద పని చేయడం తన అదృష్టమని చెప్పిన యువతి... ఆ సమయంలో భయపడినట్లుగా కనిపించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాట ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ కార్డు పొందడానికి ఆమె వద్ద డబ్బులు లేకుంటే జానీ మాస్టర్ ముంబయిలో ఇప్పించాడని తెలిపారు. కొరియోగ్రాఫర్‌గానూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.

Johnny Master
Tollywood
Telangana
Police
  • Loading...

More Telugu News