Election Commission: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుముదిని

Rani kumudini takes charge as SEC

  • రెండు రోజుల క్రితం ఎస్ఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు
  • మాసాబ్ ట్యాంక్ ఎన్నికల సంఘం కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
  • మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా ఉండనున్న రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని బాధ్యతలను స్వీకరించారు. ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. దీంతో నేడు బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ హోదాలలో పని చేశారు.

ఈ ఏడాది జులైలో ఆమె పదవీ విరమణ పొందారు. అనంతరం ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు మాసాబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. రాణి కుముదిని మూడేళ్లపాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉంటారు.

Election Commission
Telangana
State Election Commission
  • Loading...

More Telugu News