Sensex: ఫెడ్ వడ్డీ రేటు తగ్గింపు ఎఫెక్ట్... లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Sensex closes up by 236 points

  • 236 పాయింట్ల లాభాల్లో ముగిసిన సెన్సెక్స్
  • నష్టాల్లో ముగిసిన ఐటీ, పీఎస్‌యూ, బ్యాంక్, ఫార్మా రంగాలు
  • అదరగొట్టిన ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం భారత స్టాక్ మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపింది. నేడు 
భారత స్టాక్ మార్కెట్ సూచీలు  మంచి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు లాభపడి 83,184 వద్ద ముగియగా... నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 24,415 వద్ద స్థిరపడింది. 

అయితే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్ 400 పాయింట్లు క్షీణించి 59,351 వద్ద... నిఫ్టీ స్మాల్ క్యాప్-100 ఇండెక్స్ 244 పాయింట్లు నష్టపోయి 19,144 వద్ద ముగిసింది.

రంగాలవారీగా చూస్తే ఆటో, ఫిన్ సర్వీస్, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ప్రైవేటు బ్యాంకులు లాభాల్లో ముగిశాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, మెటల్, మీడియా, ఎనర్జీ రంగాలు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు భారీ లాభాలు నమోదు చేశాయి.

సెన్సెక్స్-30 స్టాక్స్‌లో కొటక్ మహీంద్రా, టైటాన్, నెస్లే, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఎల్ అండ్ టీ, టీసీఎస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ టాప్ లూజర్లుగా నిలిచాయి.

  • Loading...

More Telugu News