India vs Bangladesh: జ‌డేజా, అశ్విన్ వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌... క‌ష్ట‌ స‌మ‌యంలో కీల‌క భాగ‌స్వామ్యం!

India vs Bangladesh 1st Test in Chennai

  • చెన్నై వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ తొలి టెస్ట్‌
  • 144 ప‌రుగుల‌కే 6 వికెట్లు పారేసుకుని పీక‌ల‌లోతు క‌ష్టాల్లో టీమిండియా
  • జ‌డేజాతో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దిన అశ్విన్‌
  • అజేయంగా 89 బంతుల్లోనే 80 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పిన ద్వ‌యం

చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భార‌త జ‌ట్టుకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. 144 ప‌రుగుల‌కే 6 కీల‌క‌మైన వికెట్లు పారేసుకుని పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో క్రీజులోకి వ‌చ్చిన ర‌విచంద్ర‌న్ అశ్విన్‌... ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. 

ఈ ద్వ‌యం వ‌న్డే త‌ర‌హా బ్యాటింగ్‌తో చెల‌రేగ‌డంతో స్కోర్ బోర్డు ప‌రుగులు పెట్టింది. వీరిద్ద‌రూ 89 బంతుల్లోనే 80 ప‌రుగులు జోడించ‌డం విశేషం. అశ్విన్ అయితే బౌండ‌రీల‌తో బంగ్లా బౌల‌ర్ల‌పై ఎదురుదాడి చేశాడు.మ‌రో ఎండ్ నుంచి జ‌డేజా కూడా బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. 58 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ స్కోర్ 6 వికెట్ల న‌ష్టానికి 228 పరుగులు. అశ్విన్ 47 పరుగులతో, జ‌డేజా 32 పరుగులతో ఆడుతున్నారు. 

  • Loading...

More Telugu News