Wine Shops: ఏపీలో వైన్ షాపుల కొత్త టైమింగ్స్ ఇవే..

Wine Shops Timings In Andhra Pradesh After October 1

  • ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు వైన్స్ ఓపెన్
  • తక్కువ ధరలకు క్వాలిటీ మద్యం అందిస్తామన్న మంత్రి
  • రెండేళ్ల పరిమితితో షాప్ లైసెన్సుల మంజూరు

మద్యం ప్రియులకు ఏపీ సర్కారు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లిక్కర్ షాపులను తెరిచి ఉంచనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మద్యం పాలసీ ప్రకారం.. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంటుందని కేబినెట్ కూడా స్పష్టం చేసింది. 

వైన్స్ షాపుల కేటాయింపులో లాటరీ విధానం అవలంబిస్తామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తామన్నారు. షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలతో దరఖాస్తు చేసుకోవాలని, లాటరీ పద్ధతిలో లైసెన్స్ దక్కినా దక్కకున్నా ఈ మొత్తం తిరిగి ఇవ్వబడదని (నాన్ రిఫండబుల్) మంత్రి చెప్పారు. గీత కార్మికులకు వైన్స్ షాప్ లైసెన్సులలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News