Pechi: ఒకేసారి రెండు ఓటీటీల్లో తమిళ హారర్ థ్రిల్లర్!

Pechi Movie OTT Release Date Confirmed

  • తమిళంలో రూపొందిన 'పేచి'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • ఆగస్టు 2న విడుదలైన సినిమా  
  • రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ - ఆహా తమిళ్ లో


ఒకేసారి రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఒక తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా రావడానికి సిద్ధమవుతోంది. ఆ సినిమా పేరే 'పేచి'. వెయిలోన్ - వీరస్ నిర్మించిన ఈ సినిమాకి రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 2వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా రేపు అమెజాన్ ప్రైమ్ - ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండొచ్చని అంటున్నారు. గాయత్రి శంకర్ .. బాలా శరవణన్ .. దేవ్ .. రామనాథ్ .. ప్రీతి ప్రధానమైన పాత్రలను పోషించారు. రాజేశ్ మురుగేశన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. 

కొంతమంది స్నేహితులు .. తమిళనాడులోని 'కొల్లిమలై హిల్స్' దగ్గరికి ట్రెక్కింగ్ కోసం వెళతారు. తమకి తెలియకుండానే వారు అరణ్మనై అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశానికి వెళతారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా ఒక ప్రేతాత్మ బంధించబడి ఉంటుంది. స్నేహితుల బృందం చేసిన పని వలన ఆ ప్రేతాత్మకి విడుదల లభిస్తుంది. అప్పుడు వాళ్లకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఆ అడవి నుంచి అందరూ బయటపడగలుగుతారా? అనేది కథ. 

Pechi
Gayathri Shankar
Bala Saravanan
Ramanath
  • Loading...

More Telugu News