Ayudha Pooja Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. ‘ఆయుధపూజ’ రిలీజ్ వాయిదా

Devara Disappointing news for Jr NTR fans

  • నేటి ఉదయం 11.07 గంటలకు రిలీజ్ కావాల్సిన పాట
  • పాట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు
  • పాట రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
  • ఎప్పుడు చేసేదీ త్వరలోనే వెల్లడిస్తామన్న చిత్ర బృందం

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'దేవర' సినిమాలోని ‘ఆయుధ పూజ‘ పాట విడుదల వాయిదా పడింది. ఈ పాటను ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ ఈ నెల 27న థియేటర్లకు రానుంది. 

ఎన్టీఆర్ నుంచి దాదాపు కొన్నేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ‌‘చుట్టమల్లే’ సాంగ్‌కు విపరీతమైన బజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 11.07 గంటలకు ‘ఆయుధపూజ’ సాంగ్‌ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ నిన్న ప్రకటించారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్ గా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News