staff nurses recruitment: తెలంగాణలో స్టాఫ్ నర్సుల నియామకానికి ప్రకటన... ఎన్ని వేల పోస్టులు అంటే...!

2050 staff nurses recruitment notification released

  • 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
  • మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ లో 1576, వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ పోస్టులు
  • ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల భర్తీకి చర్యలు

తెలంగాణలో రేవంత్ సర్కార్ వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ లో ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ .. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలానే ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీతో పాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు.

More Telugu News