Nikha Zareen: డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్ నిఖత్ జరీన్

Boxer Nikhat Zareen appointed as DSP

  • బాక్సర్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
  • నిన్న నియామక పత్రాన్ని అందించిన డీజీపీ
  • ఈరోజు డీజీపీకి రిపోర్ట్ చేసిన నిఖత్ జరీన్

తెలంగాణకు చెందిన ప్రముఖ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ డీఎస్పీగా బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు నిఖత్ జరీన్‌కు నియామక పత్రాన్ని తెలంగాణ డీజీపీ నిన్న అందించారు. 

ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగంలో ఆమెకు డీఎస్పీగా ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు ఆమె విధుల్లో చేరారు. ఆమె ఈరోజు డీజీపీకి రిపోర్ట్ చేశారు.

  • Loading...

More Telugu News