Corona Virus: కరోనాలో కొత్త వేరియంట్... 27 దేశాలకు వ్యాప్తి

Corona new variant found in 27 nations

  • కొత్తగా ఎక్స్ఈసీ వేరియంట్
  • జర్మనీలో గుర్తింపు
  • యూరప్ దేశాల్లో వ్యాప్తి

యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఇప్పటికీ ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ ఆ తర్వాత అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఈ కరోనా వేరియంట్ ను ఎక్స్ఈసీగా పిలుస్తున్నారు. దీన్ని మొట్టమొదట జర్మనీలో గుర్తించారు. ఇది యూరప్ దేశాల్లో విజృంభిస్తోందని... జర్మనీతో పాటు, బ్రిటన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ దేశాల్లో ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 

అయితే, కరోనా వైరస్ లోని ఇతర రకాలతో పోల్చితే ఎక్స్ఈసీ వేరియంట్ వ్యాప్తి చెందే వేగం తక్కువేనని నిపుణులు అంటున్నారు. చలికాలంలో దీని ప్రభావం అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఒమిక్రాన్ వేరియంట్ పరంపరలోనిదే కాబట్టి, వ్యాక్సిన్ తో నివారించవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News