Johnney Master: లైంగిక వేధింపుల కేసు... జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు

Police issues notices to Johnny Master

  • బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు
  • ఆధారాల కోసం బాధితురాలి ఇంటికి పోలీసులు
  • కేసుకు సంబంధించి వివరాలు సేకరించిన పోలీసులు

ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈరోజు జానీ మాస్టర్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

పోలీసులు ఈ రోజు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరిన్ని ఆధారాల కోసం పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు సేకరించిన పోలీసులు అతనికి నోటీసులు జారీ చేశారు.

బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించినట్లుగా కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని టాలీవుడ్ లైంగిక వేధింపుల ప్యానెల్ తెలిపింది. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జదగీశ్వర్ రెడ్డి


వివిధ రంగాల్లో లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని, కానీ మరికొంతమంది ఎవరికీ చెప్పలేక అఘాయిత్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరిగిన, జరుగుతున్న అత్యాచారాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలన్నారు.

కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ విడుదలయ్యాక మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో చెబితే ఎలా? లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. జానీ మాస్టర్‌కు ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వవద్దని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖను కోరారు. షూటింగ్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకు రావాలన్నారు.

  • Loading...

More Telugu News