Instagram: టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యేక అకౌంట్లు... మెటా నిర్ణయం

instagram makes teen accounts private as pressure mounts on the app to protect children

  • సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం
  • 18ఏళ్ల లోపు వారికి ప్రత్యేకంగా టీన్ అకౌంట్లు
  • ఇకపై తల్లిదండ్రుల నియంత్రణలో పిల్లల ఇన్‌స్టా అకౌంట్ లు 

పిల్లల జీవితాలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాల లోపు వారి కోసం ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా టీన్ అకౌంట్స్‌ను ప్రవేశపెట్టింది. పిల్లల ఇన్‌స్టా ను సురక్షిత వేదికగా మార్చేందుకు గానూ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మంగళవారం నుండే కొత్త విధానాన్ని మెటా అమల్లోకి తీసుకొచ్చింది. కొత్తగా ఇన్ స్టా లో చేరే 18 ఏళ్ల లోపు వారికి ఇకపై టీన్ అకౌంట్లను ఇస్తారు. ఇప్పటికే ఉన్న ఖాతాలను 60 రోజుల్లోగా టీన్ అకౌంట్లుగా మార్పు చేస్తారు. 

టీన్ అకౌంట్స్ వారి పెద్దల పర్యవేక్షణలో ఉంటాయి. 16 ఏళ్ల లోపు ఉన్న యూజర్లు డీఫాల్ట్ సెట్టింగ్స్‌ను మార్పు చేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. దీని వల్ల పిల్లలు వాడే ఇన్‌స్టా అకౌంట్‌పై తల్లిదండ్రుల నిఘా సాధ్యమవుతుందని మెటా వెల్లడించింది. టీన్ ఖాతాలకు సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చూపించే ఫీడ్ పై నియంత్రణ ఉంటుంది. డైరెక్ట్ మెసేజ్ లు, కామెంట్స్ లో అసభ్య పదజాలాన్ని ఇన్‌స్టా ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేస్తుంది. పేరెంట్స్ కావాలంటే పిల్లల ఇన్‌స్టా మెసేజ్‌లను యాక్సెస్ చేయవచ్చు అలానే రోజువారీ వినియోగాన్ని తనిఖీ చేయడం, నిర్ణీత సమయంలోనే ఇన్‌స్టా వాడకుండా బ్లాక్ చేయడం వంటివి చేయవచ్చు.

  • Loading...

More Telugu News