Tirumala: శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల కోటా టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదిగో!

december quota of srivari arjitaseva tickets will be released Today

  • తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల డిసెంబర్ నెల కోటా
  • బుధవారం ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టిటిడీ 
  • ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20న ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పిన అధికారులు
  • సెప్టెంబర్ 27న నవనీత సేవ, పరకామణి సేవ కోటా ఆన్ లైన్ లో విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను టీటీడీ ఈ రోజు (బుధవారం) పది గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయని చెప్పారు. 
 
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను సెప్టెంబర్ 21న ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తెలిపారు. అదే రోజు వర్చువల్ సేవల కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నామని చెప్పారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబర్ 23న ఉదయం పది గంటలకు, వాణి ట్రస్ట్ టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 

24వ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, తిరుమల, తిరుపతిలలో గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27న శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటా మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటా మధ్యాహ్నం 1 గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నామని చెప్పారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News