Donald Trump: ప్రధాని మోదీని కలవనున్న డొనాల్డ్ ట్రంప్!

Trump to meet PM Modi next week

  • 21 నుంచి 23 మధ్య అమెరికాలో మోదీ పర్యటన
  • ఈ సమయంలో ట్రంప్‌ను కలిసే అవకాశముందని ప్రచారం
  • ఎక్కడ కలుస్తారనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి 23వ తేదీ మధ్య అమెరికాలో పర్యటిస్తున్నారు.

మిషిగాన్‌లోని ఫ్లింట్‌లో ట్రంప్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారత్-అమెరికా వాణిజ్యం గురించి మాట్లాడారు. ఇదే సమయంలో భారత ప్రధానితో సమావేశమవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడ కలుస్తారనే విషయమై ఎలాంటి వివరాలు వెల్లడించలేదని చెబుతున్నారు.

అద్భుతమైన వ్యక్తిని కలవబోతున్నాను: ట్రంప్

వచ్చే వారం అమెరికా పర్యటనకు రానున్న అద్భుతమైన వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోదీని కలవబోతున్నానని ట్రంప్ వెల్లడించారు. మిషిగాన్‌లోని టౌన్ హాలులో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికాకు రానున్న మోదీ తనను కలుస్తారని, ఆయనో అద్భుతమైన వ్యక్తి అనీ అన్నారు.

Donald Trump
Narendra Modi
USA
India
  • Loading...

More Telugu News