motilal oswal foundation: ఏకంగా రూ.130 కోట్ల విరాళం... అతి పెద్ద కార్పొరేట్ విరాళాల్లో ఇది కూడా ఒకటి!

motilal oswal foundation donations to iit bombay

  • బాంబే ఐఐటీకి రూ.130 కోట్ల విరాళాన్ని అందించిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్
  • విద్యాసంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్‌ను మరింతగా మెరుగుపర్చేందుకు ఈ ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు ప్రకటన 
  • ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్

ప్రముఖ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ అతి పెద్ద కార్పొరేట్ విరాళాన్ని అందించింది. ఈ ఫౌండేషన్ ఏకంగా రూ.130 కోట్ల విరాళాన్ని ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ బాంబే ఐఐటీకి అందించింది. ఈ విద్యాసంస్థలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ను మరింతగా మెరుగుపర్చేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ తెలిపింది. అత్యాధునిక విద్య సంబంధిత మౌలిక వసతుల ఏర్పాటు, ఫైనాన్షియల్ మార్కెట్ లో వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణే లక్ష్యంగా ఈ సాయాన్ని అందించింది. 
 
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎంఒఎఫ్ఎస్ఎల్) రూ.4000 కోట్ల ఈక్విటీల్లో పది శాతం దాతృత్వం కోసం ఇస్తామని ఇంతకు ముందు ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రకారం ఈ మొత్తాన్ని అందజేయడం విశేషం. ఐఐటీ బాంబేలో మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటునకు ఇది తోడ్పడనుంది.
 
తమ విద్యాసంస్థకు పెద్ద మొత్తంలో విరాళం అందించిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ కు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీశ్ కెదారె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ట్రస్టీ మోతీలాల్ ఓస్వాల్ మాట్లాడుతూ .. మోతీలాల్ ఓస్వాల్ నాలెడ్జ్ సెంటర్, సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహాత్మక దాతృత్వ శక్తికి నిదర్శనంగా ఉంటాయన్నారు.

  • Loading...

More Telugu News