Chandrababu: ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థికసాయం అందిస్తున్నాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu press meet on flood damage assistance

  • ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
  • చిరువ్యాపారులకు రూ.10 వేలు
  • నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు ఆర్థికసాయం
  • పంటలకు వరద సాయం ప్రకటించిన ఏపీ సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరదసాయం వివరాలు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు ఇస్తామని వెల్లడించారు. ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు రూ.10 వేలు ఇస్తామని వివరించారు. 

చిరువ్యాపారులకు రూ.25 వేలు ఇస్తామని, నష్టపోయిన ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు)లకు ఆర్థికసాయం అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.1 లక్ష సాయం అందిస్తామని చెప్పారు. రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.1.5 లక్షలు అందిస్తామని చెప్పారు. 

బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9 వేలకు పైగా క్లెయిమ్ లు ఉన్నాయని... బైకుల యజమానులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్ లు దాఖలు చేశారని చంద్రబాబు వివరించారు. రూ.6 కోట్లు చెల్లించగా, ఇంకా 6 వేల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. 

త్రిచక్రవాహనదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఎడ్లబండ్లు కోల్పోయిన వారికి కొత్త బండ్లు అందజేస్తామని వెల్లడించారు.

ఇక, చేనేత కార్మికులకు రూ.15 వేలు, మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు, ఫిషింగ్ బోట్ల నెట్ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసమైతే రూ.9 వేలు, ఫిషింగ్ బోట్ల నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైతే రూ.20 వేలు, మోటార్ ఫిషింగ్ బోట్ల నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైతే రూ.25 వేలు, ఒక హెక్టారులో ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్ కు రూ.15 వేలు ఇస్తున్నామని చెప్పారు.

పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు, దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7,500, కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు, ఒక హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాలకు రూ.10 వేలు, హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్ చెరకు పంటకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్ మొక్కజొన్నకు రూ.15 వేలు, హెక్టార్ రాగులు పంటకు రూ.15 వేలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 

హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటలకు రూ.15 వేలు... కొర్రలు, సామలు, జనపనార పంటలకు రూ.15 వేలు... పసుపు, అరటికి రూ.35 వేలు, కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటాకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు, ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మ తోటలకు రూ.35 వేలు, మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు, పుచ్చరైతులకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు, దానిమ్మకు రూ.35 వేలు, సపోటాకు రూ.35 వేలు, డ్రాగన్ ఫ్రూట్ కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500, సెరీకల్చర్ కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 ఇస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.

ఇక, 175 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారికి రూ.50 వేలు... మొదటి అంతస్తు, ఆపైన ఉండేవారికి రూ.25 వేలు సాయం ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News