Peethala Sujatha: జగన్ స్క్రిప్ట్ తోనే హీరోయిన్ జెత్వానీపై కేసులు నమోదు చేశారు: పీతల సుజాత

Peethala Sujatha comments on Jagan

  • నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందన్న సుజాత
  • తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • వైసీపీ 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా

ముంబయి హీరోయిన్ కాదంబరి జెత్వానీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ అశంపై టీడీపీ నాయకురాలు పీతల సుజాత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

జెత్వానీ కేసు భయంతో నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. జగన్ స్క్రిప్ట్ తోనే జెత్వానీపై కేసులు నమోదు చేశారని అన్నారు. జెత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను వైసీపీ నేతలు హింసించారని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వ్యక్తులైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. 

వైసీపీ ప్రభుత్వంలో చేసినట్టు కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తామంటే కుదరదని చెప్పారు. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ మైండ్ బ్లాక్ అయిందని అన్నారు.

Peethala Sujatha
Telugudesam
Jatwani
Jagan
YSRCP
  • Loading...

More Telugu News