Nara Lokesh: ఫేక్ జగన్ నువ్వు మారవు... నీ ఫేక్ మూకలు అస్సలు మారరు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh responds on viral video

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై లోకేశ్ స్పందన
  • ఇలా ఫేక్ చేయబట్టే 151 నుంచి 11 సీట్లకు వచ్చావంటూ జగన్ పై వ్యంగ్యం
  • శ్రీవారితో పెట్టుకోవద్దు... ఒక్క సీటు కూడా లేకుండా పోతావ్ అని వార్నింగ్

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో కలకలంర రేపింది. రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుటుంబ సభ్యులు తిరుమల కొండపై అపచారానికి పాల్పడ్డారంటూ దుమారం రేగింది. దీనిపై గుమ్మిడి సంధ్యారాణి కూడా వివరణ ఇచ్చారు. అది తిరుమల వీడియో కాదని, విజయవాడ వీడియో అని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఫేక్ జగన్ నువ్వు మారవు... నీ ఫేక్ మూకలు అస్సలు మారరు అంటూ ధ్వజమెత్తారు. 

"ఫేక్ చేసీ చేసీ 151 నుంచి 11కి వచ్చావు... మంత్రి సంధ్యారాణి విజయవాడ నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిపినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నావు... శ్రీవారితో పెట్టుకోవద్దు... ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు... ఒక్క సీటు కూడా లేకుండా పోతావ్" అని లోకేశ్ ఘాటుగా హెచ్చరించారు.

Nara Lokesh
Viral Video
Jagan
Gummidi Sandhya Rani
TDP-JanaSena-BJP Alliance
YSRCP
  • Loading...

More Telugu News